హుజూర్ నగర్ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం - మంత్రి జగదీష్ రెడ్డి

హుజూర్ నగర్ శాసనసభ  టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి జగదీష్ రెడ్డిI
     *మంత్రి కామెంట్స్* 
        శాసన సభ ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్  టి.ఆర్.ఎస్ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డి ని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు  ప్రకటించారు.
      హుజూర్ నగర్ లో టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయం
     టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ని గెలిపించాలని  హుజూర్ నగర్  నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉన్నారు.
     అభివృద్ధి లో హుజూర్ నగర్ నియోజవర్గం వెనక బడటానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి నే.
    ఏ ఒక్కరోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు


ఉ త్తమ్ కు  తమ  పట్ల ఉన్న చులకన భావం , అభివృద్ధి పట్ల ఉన్న  నిర్లక్ష్యం ను ప్రజలు గమనించారు
       2014 తరువాత హుజూర్ నగర్ నియోజకవర్గం లో ఉన్న ఏ ఒక్క సమస్యను కూడా జిల్లా మంత్రి గా ఉన్న తన వద్దకు గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి గాని ఉత్తమ్ తీదుకురాలేదు
        ప్రభుత్వం చేస్తున్న పనులకు తోడు   స్థానిక శాసన సభ్యుడి కృషి ఉంటేనే అభివృద్ధి సాధ్యం