హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగేందుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో విజయం కోసం భారత్ తహతహలాడుతుంది. మరోవైపు న్యూజిలాండ్ మూడో టీ 20 గెలిచి సిరీస్‌ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఈ మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ గడ్డపై తొలి ట్రోఫీ చేజిక్కించుకున్న రికార్డ్ భారత్ ఖాతాలో చేరుతుంది. భారత బ్యాటింగ్‌లో లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ విజృంభిస్తుంటే.. బౌలింగ్‌లో బుమ్రా, జడేజా జోరు మీదున్నారు. బ్లాక్ క్యాప్స్‌లో ఎవరు పెద్దగా రాణించకపోవడం ఆ జట్టుని నిరాశపరుస్తుంది. భారత్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా, న్యూజిలాండ్ టీంలో ఒక మార్పు జరిగింది. హామిల్టన్ పిచ్ కూడా బ్యాటింగ్‌కి అనుకూలం కాగా, ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయం అని అంటున్నారు.
టాస్ ఓడిన భారత్.. సిరీస్‌పై గురి పెట్టిన కోహ్లీ సేన