మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం: కమల్‌హాసన్‌


 భారతీయుడు-2 సినిమా కోసం సెట్టింగ్‌ వేస్తుండగా..క్రేన్‌ తెగిపడిన ఘటనపై కమల్‌హాసన్‌ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరుగడం దురదృష్టకరం. ప్రమాదంలో ముగ్గురు స్నేహితులను కోల్పోయాం. పేదరికంలో నుంచి వచ్చిన ముగ్గురు కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందజేస్తానని కమల్‌హాసన్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. 150 అడుగుల ఎత్తునున్న క్రేన్‌ విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారిలో డైరెక్టర్‌ శంకర్‌ అసిస్టెంట్‌ మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ, సహాయకుడు చందర్‌ ఉన్నారు. 10 మందికిపైగా గాయాలవగా వారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు.